తారక్‌ ‘క్రైమ్ పార్టనర్‌’ చరణ్‌ ఏం చేశాడంటే!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌ని యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి క్రైమ్ పార్టనర్‌గా అభివర్ణించారు. అవును మరి, చరణ్‌ - ఎన్టీఆర్‌ మంచి స్నేహితులు కదా.! ఇద్దరూ కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చేస్తున్నారు కదా.! అదీ అసలు సంగతి. ‘బి ద రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌లో భాగంగా రాజమౌళి ఇచ్చిన టాస్క్‌ని యంగ్‌ టైగర్‌ పూర్తి చేస్తూ, మెగాస్టార్‌ చిరంజీవిని నామినేట్‌ చేసిన విషయం విదితమే. తారక్‌ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్‌ చేస్తున్నట్లు వెల్లడించిన మెగాస్టార్‌, ‘నీ క్రైమ్ పార్టనర్‌’ వీడియో కోసం వెయిటింగ్‌.. అంటూ ట్వీటేశారు. తన ట్వీట్‌కి ‘ఛాలెంజ్‌’ సినిమాలోని ‘ఇట్స్‌ మై ఛాలెంజ్‌’ అనే డైలాగ్‌ తాలూకు వీడియో బైట్‌ని మెగాస్టార్‌ చిరంజీవి జత చేయడం గమనార్హం.

 

మరోపక్క, జక్కన్న నుంచి ఛాలెంజ్‌ని స్వీకరించిన మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌, ఫ్లోర్‌ క్లీనింగ్‌ చేపట్టాడు. మొక్కలకు నీళ్ళు పోశాడు, మాసిన బట్టల్ని తీసుకెళ్ళి, ఉతికేసినట్టున్నాడు కూడా. చివరగా, వంటింట్లోకి వెళ్ళి కాఫీ కలిపి, తన భార్య ఉపాసనకు కాఫీ ఇచ్చాడు రామ్ చరణ్‌. దీనికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చరణ్ విడుదల చేశాడు. అదిరింది కదూ ‘బి ద రియల్‌ మ్యాన్‌’ ఛాలెంజ్‌. తన స్నేహితులు రానా దగ్గుబాటి, శర్వానంద్‌లకు ఈ సందర్భంగా ఈ ఛాలెంజ్‌ కోసం నామినేట్‌ చేశాడు మెగా పవర్‌ స్టార్‌. అన్నట్టు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ని కూడా లిస్ట్‌లో రావ్‌ు చరణ్‌ చేర్చడం గమనార్హం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS