చిరంజీవి 152వ చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకుడు.కాజల్ కథానాయిక. రామ్ చరణ్ కీలక పాత్రధారి. లాక్ డౌన్ తరవాత... ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ షూటింగ్ కి ముహూర్తం ఖరారైంది. ఈనెల 9 నుంచి... హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. అయితే.. చిరు, చరణ్, కాజల్‌లు లేకుండానే షూటింగ్ మొదలు కానుంది. వాళ్లు లేని సన్నివేశాల్ని ముందుగా తెరకెక్కిస్తారు.
ఆ తరవాత ముందుగా చిరు, ఆ తరవాత చరణ్ సెట్లో అడుగుపెడతారని టాక్. చిరు - చరణ్‌ల మధ్య ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు తెరకెక్కించాల్సివుంది. చిత్రంలో కీలకమైన భాగం అది. అందుకోసం `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్‌కి చరణ్ బ్రేక్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నారు. అయితే.. రాజమౌళి నుంచి చరణ్‌కి ఇంకా అనుమతులు రాలేదు. అందుకే ముందుగా చరణ్ లేని ఎపిసోడ్ల పని పట్టాలని కొరటాల భావిస్తున్నారు. 2021 వేసవిలో ఆచార్య విడుదలయ్యే అవకాశాలున్నాయి.