చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారిప్పుడు. ఆచార్య సెట్ పై ఉండగానే చాలా సినిమాలు ఫైనల్ చేసుకున్నారు. అందులో `లూసీఫర్` ఒకటి. మలయాళంలో ఘన విజయం సాధించిన సినిమా ఇది. మోహన్ లాల్ కథానాయకుడిగా నటించారు. దాన్ని చిరు రీమేక్ చేయాలని ఫిక్సయిన సంగతి, ఆ బాధ్యత వినాయక్ పై పెట్టిన సంగతీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ సినిమా నుంచి వినాయక్ తప్పుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.
స్క్రిప్టు వర్క్ కుదరడం లేదో, లేదంటే ఈ రీమేక్ చేయడం ఇష్టం లేదో, లేదంటే.. చిరుతో సినిమా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలస్యం అవుతుందనో... ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని వినాయక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ వినాయక్ తప్పుకుంటే ఆ బాధ్యత ఎవరికి అప్పగించాలి? అనే విషయంలోనూ మెగాస్టార్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వినాయక్ తప్పుకుంటే.. `సాహో` దర్శకుడు సుజిత్ ఈ రీమేక్ కి టేకప్ చేసే అవకాశాలున్నాయని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్.