సూపర్ స్టార్ మహేష్‌బాబు గతంలో ఓ సారి సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేశాడు. కానీ, ఎందుకో చివరి నిమిషంలో వెనక్కి తగ్గాడు. నిజానికి మహేష్, షర్ట్ లెస్‌గా కనిపించడానికి ఇష్టపడడు. ఎప్పుడూ ఫిట్‌గా వుండే మహేష్, కండలు తిరిగిన శరీరంతో కనిపించాలని అతని అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే, మహేష్ మాత్రం.. ఈ విషయమై ఆచి తూచి వ్యవహరిస్తున్నాడు. ఇదిలా వుంటే, తాజాగా మరోమారు మహేష్ సిక్స్ ప్యాక్.. అంటూ టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.
‘ఈసారి తప్పేలా లేదు.. తన తాజా చిత్రంతో మహేష్ సూపర్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడు..’ అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న విషయం విదితమే. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. ఈ సినిమాలో మహేష్ మీద సూపర్బ్ యాక్షన్ సీన్‌ని దర్శకుడు డిజైన్ చేశాడనీ, ఈ ఫైట్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్‌ని తీసుకు రాబోతున్నారనీ, మహేష్ కూడా ఫిట్‌నెస్ మీద మరింత ఫోకస్ పెట్టి, ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రెయినర్‌ని నియమించుకున్నాడనీ అంటున్నారు.
ఈ ఊహాగానాల్లో నిజమెంతోగానీ, మహేష్‌ని సిక్స్ ప్యాక్ కాదు, ఎయిట్ ప్యాక్ ఫిజికల్‌లో చూడాలని అభిమానులు ఆశిస్తున్నారన్నది నిర్వివాదాంశం.