త్వరలోనే షూటింగులు మొదలు కాబోతున్నాయి. జూన్ మొదటి వారంలో షూటింగులకు అనుమతి ఇవ్వడంతో దర్శక నిర్మాతలు కొత్త షెడ్యూళ్లు రెడీ చేసుకోవడం లో బిజీ అయ్యారు. అయితే కొంతమంది హీరోలు.. సెట్ కి రావడానికి ఇంకా జంకుతున్నారు. హీరోయిన్లు కూడా షూటింగులకు డుమ్మా కొట్టాలని చూస్తున్నార్ట. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం.. షూటింగులకు సై అంటున్నారు. అందరి కంటే ముందుగా `ఆచార్య`ని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఆయన సమాయాత్తం అవుతున్నారు.
జూన్ 15 నుంచి కొత్త షెడ్యూల్ మొదలెడతారని సమాచారం. ఈ షెడ్యూల్లో రెండు పాటలు, ఓ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తారని సమాచారం. కరోనా భయంతో ఇండోర్ లోనే షూటింగులు చేసుకోవాల్సివస్తోంది. అందుకే ముందుగా.. ఇండోర్ షెడ్యూల్ ముగించాలని చూస్తున్నారు. త్వరలోనే సెట్స్‌కి సంబంధించిన పనులు మొదలు కానున్నాయి. చిరంజీవి కూడా ఈలోగా డాన్స్ రిహార్సల్స్ చేస్తున్నార్ట. ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్నది చిరు ప్లాన్.