లైగర్ సినిమా చాలా దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. పూరి జగన్నాధ్ కి ఫ్లాపులు వున్నాయి. ఆయన ఫ్లాపు లు సైతం ఎక్కడో చోట చెప్పుకోదగ్గ అంశం వుంటుంది. లైగర్ లో మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ఏదీ లేకుండా పోయింది. పాన్ ఇండియా ప్లాన్ వేశారు పూరి లైగర్ కోసం. పాన్ ఇండియా ప్లాన్ తెచ్చిన తంటా ఏమిటో గానీ అసలు లైగర్ కి నేటివిటి లేకుండా పోయింది. చాలా అవుట్ డేటడ్ ట్రీట్మెంట్ తో నిరాశ పరిచారు పూరి.
నిజానికి ఈ కథ అనుకున్నపుడు ఇందులో విజయ్ దేవరకొండ లేడు. అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిలతో సినిమా చేస్తునప్పుడు పూరి లైగర్ కథ అనుకున్నాడు. ఈ కథ అల్లు అర్జున్ కి చెప్పాడు. ఇద్దరమ్మాయిలతో రిజల్ట్ కారణంగా బన్నీ సున్నితంగా వద్దు అనేశాడు. తర్వాత కథ చరణ్ దగ్గరికి వెళ్ళింది. చరణ్ నుండి కూడా రెడ్ సిగ్నల్ పడింది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో విజయ్ పూరి లైన్ లోకి వచ్చాడు.
పదేళ్ళ క్రితం అనుకున్న కథే విజయ్ కి చెప్పాడు పూరి. నత్తి ఫైటర్ అనేసరికి విజయ్ ఎక్సయిట్ అయ్యాడు. పూరితో చేస్తే మాస్ ఇమేజ్ వస్తుందని విజయ్ ఆశ. ఐతే ఆ ఆశ నిరాశే అయ్యింది. పూరి పదేళ్ళ నిరీక్షణ లైగర్ రూపంలో విజయ్ కి తీవ్ర నిరాశని మిగిల్చింది.