ఆ కాంబోలో మెగా స్టార్ మూవీ లేనట్లేనా.?

మరిన్ని వార్తలు

చిరంజీవి, అల్లు అరవింద్‌ బావ బావమరుదులే కాదు, ఇండస్ట్రీకి ఇద్దరూ పెద్ద దిక్కు కూడా. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌ తెరకెక్కాయి. కానీ, విచిత్రంగా చిరంజీవి రీ ఎంట్రీలో అల్లు అరవింద్‌ ప్రొడక్షన్‌లో ఒక్క సినిమా కూడా ఓకే కాకపోవడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి, అల్లుఅరవింద్‌ని కలిపి మెగా కాంపౌండ్‌గానే కౌంట్‌ చేసేశారు. కానీ, ఇప్పుడు ఆ పద్థతి మారింది. మెగా కాంపౌండ్‌, అల్లు కాంపౌండ్‌ అని డివిజన్‌ ఏర్పడింది.

అంతేకాదు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నిర్మాతగా మారి, రీ ఎంట్రీలో చిరంజీవి సినిమాలన్నీ ఆయనే నిర్మించుకుంటూ పోతున్నాడు. దాంతో మేనమామకి అవకాశమివ్వడం లేదంటూ చరణ్‌ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అదే తడవుగా, చిరంజీవికీ, అల్లు అరవింద్‌కీ ఈ కారణంగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్‌ వచ్చాయంటూ గిట్టని వాళ్లు చేసే ప్రచారం కూడా ఎక్కువైంది. అయితే, ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, అరవింద్‌తో చిరు సినిమా సెట్‌ అవ్వాలంటే, అందుకు ఈక్వేషన్స్ అన్నీ కుదరాలి కదా. అలా కుదిరిన నాడు ఈ కాంబో ఖచ్చితంగా సెట్‌ అవుతుందంటున్నారు మెగా అభిమానులు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS