ఈరోజు సాయంత్రం ఆచార్య ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఆ వేడుకకు రాజమౌళిని ప్రత్యేక అతిథిగా వస్తున్నారు. అయితే కేవలం గెస్ట్ గానే కాదు.. ఈ ఈవెంట్ లో ఇంకో సర్ ప్రైజ్ కూడా వుంది. చిరు ఈ కార్యక్రమంలో రాజమౌళి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించబోతున్నారని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి అందరు దర్శకులు కోరుకునే హీరో. రాజమౌళి కూడా అందరు హీరోలు కోరుకునే దర్శకుడు. ఇలాంటి వేదికలపై ఫార్మాలిటీగా మీతో సినిమా చేయాలనీ వుందని అనడం కామన్. కానీ ఈ ప్రకటన అలా కాదు.. నిజంగానే రాజమౌళితో సినిమా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
చిరు ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. మూడేళ్ళు పాటు చిరు డైరీ ఫుల్ గా వుంది. రాజమౌళి సినిమా అంటే కనీసం మూడేళ్ళు కావాలి. ఇలాంటి పరిస్థితిలో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే సంగతి తెలీదు కానీ చిరు- రాజమౌళి సినిమా ప్రకటన మాత్రం పక్కా అని వినిపిస్తుంది.