చిత్ర‌ల‌హ‌రికి... మెగా ప్ర‌శంస‌లు అందేశాయి..!

By iQlikMovies - April 15, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

మెగా హీరోల‌లో ఎవ‌రు హిట్టు కొట్టినా, అది త‌న‌కే వ‌చ్చింద‌నేంత ఆనందం వ్య‌క్తం చేస్తుంటారు చిరంజీవి. తాజాగా 'చిత్ర‌ల‌హ‌రి' సినిమా కూడా ఆయ‌న‌కు బాగా న‌చ్చేసింది. ఈ సినిమాకి వ‌చ్చిన రివ్యూలు, వ‌సూళ్లు చిరుని ఖుషీ చేశాయి. అందుకే ఈ సినిమాని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు.  చిత్ర‌ల‌హ‌రి విజ‌యాన్ని ఆస్వాదిస్తూ చిరు ఓ వీడియోని పోస్ట్ చేశారు.

''కిషోర్ తిరుమ‌ల 'చిత్ర‌ల‌హ‌రి' చిత్రాన్ని సెటిల్డ్ మెసేజ్‌తో చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభను నిరూపించుకున్నారు. ఇక తేజు కూడా న‌టుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకున్నాడు. మెచ్యూర్డ్ పెర్‌ఫార్మెన్స్‌తో చాలా చ‌క్క‌గా న‌టించాడు. ప‌రిణితిని సాధించిన న‌టుడిగా నిరూపించుకున్నాడు. పోసాని కృష్ణ‌ముర‌ళి, సునీల్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించి నిండుద‌నం తెచ్చారు. దేవిశ్రీ ప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. స‌క్సెస్‌ఫుల్ సినిమాల‌కు మైత్రీ మూవీస్ సంస్థ అడ్ర‌స్‌గా నిలుస్తుంది. వారి ప్ర‌తిష్ట‌ను మ‌రింత నిల‌బెట్టుకునే ఈ సినిమాను రూపొందించారు.

బంధాలు, అనుబంధాలు గురించి ముఖ్యంగా తండ్రి కొడుకు మ‌ధ్య అనుబంధం గురించి చ‌క్క‌గా చెప్పారు. ఎలాంటి ఒడుదొడుకులు వ‌చ్చినా మ‌నం అనుకున్న ల‌క్ష్యం సాధించ‌డానికి కృషితో ముందుకు వెళ్లాల‌ని చెప్పిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'. ఈ వేస‌వికి విడుద‌లైన చిత్ర‌ల‌హ‌రి ప్ర‌తి ఒక్క‌రూ చూడ‌ద‌గ్గ చిత్రం.  సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు నా శుభాకాంక్ష‌లు'' అని ఆ వీడియోలో పేర్కొన్నారు చిరు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS