ఈ మధ్య నాని కారుకు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ యాక్సిడెంట్ తీవ్రత ఎంత? అనే విషయం మాత్రం తెలీడం లేదు. నాని అయితే నేను ఆరోగ్యంగానే ఉన్నానంటున్నాడు. కానీ బయట పలు రకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అయినా కారు డ్యామేజ్ తీవ్రతను బట్టి చూస్తే, నానికి బలంగానే దెబ్బలు తగిలి ఉంటాయనిపిస్తోంది. అభిమానులు కూడా అదే ఆందోళన చెందుతున్నారు.
నానికి చిన్నపాటి సర్జరీలు జరగాయనీ, సమ్‌థింగ్ ఫ్రాక్చర్స్‌లాంటివి కూడా జరిగాయనీ, ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో నిజమెంతో తెలీదు కానీ, మరో పక్క దవడ ఎముకలు విరిగాయనీ, లేదు లేదు నుదుటిపై పెద్ద దెబ్బ ఏదో తగిలిందనీ ఒక్కటేమిటి రకరకాల గాసిప్స్ నాని యాక్సిడెంట్ విషయమై ప్రచారంలో ఉన్నాయి. కానీ అసలు నాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయం ఏంటనేది తెలియడం లేదు. దాంతో ఈ గాసిప్స్‌తో నానికి ఏమైందంటూ, అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు.
నాని స్పందిస్తే కానీ ఈ గాసిప్స్‌కి అడ్డుకట్ట వేయలేం. మరో పక్క నాని తొలిసారి నిర్మాణం వహిస్తున్న 'అ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది ఈ రోజు. ఈ ఈవెంట్‌లో 'అ' అఫీషియల్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ సినిమాకి నాని సమర్పకుడు కాబట్టి ఖచ్చితంగా ఈవెంట్‌కి హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ అలా నాని హాజరైతే తప్ప ఈ గాసిప్స్‌ని ఆపడం ఎవ్వరి తరం కాదు. చూడాలి మరి నాని వస్తాడో..? లేదో..? ప్రస్తుతం నాని 'కృష్ణార్జున యుద్ధం' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ యాక్సిడెంట్ కారణంగా తాత్కాలికంగా ఆ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. ఇటీవలే 'ఎంసీఏ' సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు నాని.