మెగాస్టార్ చిరంజీవి నటసింహం బాలకృష్ణ. ఈ ఇద్దరు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నటులు, ఈ ఇద్దరికీ లక్షల సంఖ్యలో అభిమాన ఘనం ఉంది.
అయితే ఈ ఇద్దరు కలిసి ఒక చిత్రం చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకి తన వద్ద సమాధానం ఉంది అంటున్నాడు ఒక యువ దర్శకుడు. ఆ దర్శకుడు ఎవరో కాదు- ‘అ’ చిత్రం తో అందరితోనూ ‘అ’ అనిపించిన ప్రశాంత్ వర్మ. తన మొదటి చిత్రం ఇచ్చిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్ సినిమా రంగంలో తన లక్ష్యాలని బయటపెట్టాడు.
ఎప్పటికైనా బాలకృష్ణ తో మంచి కమర్షియల్ సినిమా చేయాలనీ ఆయనకీ బలంగా ఉందట. అలాగే మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పే అవకాశం కూడా ఈ మధ్యనే వచ్చిందట. దీనితో ఈ ఇద్దరినీ కలిపి ఒక మంచి మల్టీ స్టారర్ తీయాలని ఉన్నట్టు ప్రశాంత్ తెలిపాడు.
మరి ఈ కుర్ర డైరెక్టర్ అనుకున్నట్టుగానే గనుక వీరిరువురిని పెట్టి ఒక మంచి సినిమా తీస్తే అది నిజంగా అధ్బుతం అవుతుందనే చెప్పాలి.