చిరు, బాలయ్య క‌లిసి వ‌స్తారా...??

By iQlikMovies - November 05, 2018 - 12:44 PM IST

మరిన్ని వార్తలు

ఈనెల 11న స‌రిగ్గా 11 గంట‌ల‌కు మోస్ట్ వెయిటెడ్ కాంబినేష‌న్ సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. అదేంటే తెలుసుగా.. రాజ‌మౌళి- రామ్‌చ‌ర‌ణ్‌- రామారావుల ఈ కాంబో... ఆరోజే కొబ్బ‌రికాయ కొట్టుకోబోతోంది. అందుకే అంద‌రి దృష్టీ... అటువైపు ప‌డిపోయింది. షూటింగ్‌ని కూడా అట్ట‌హాసంగా మొద‌లుపెట్టాల‌ని రాజ‌మౌళి నిర్ణ‌యించుకున్నార‌ని స‌మాచారం. 

అందుకోసం ఇద్ద‌రు ప్ర‌త్యేక అతిథుల్ని ఆహ్వానించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. చిరంజీవి, బాల‌కృష్ణ ఈ ఓపెనింగ్‌కి ప్ర‌త్యేక అతిథులుగా రాబోతున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. రామ్‌చ‌ర‌ణ్ సినిమా అంటే చిరు ఎంట్రీ త‌ప్ప‌నిస‌రి. ఈమ‌ధ్య `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` స‌క్సెస్ మీట్‌కి వ‌చ్చిన బాల‌య్య `మేమంతా ఒక్క‌టే` అనే సంకేతాన్ని నంద‌మూరి అభిమానుల‌కు అందించారు. అందుకే బాల‌య్య కూడా ఈ ఓపెనింగ్‌కి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని టాలీవుడ్ టాక్‌. 

రాజ‌మౌళి అడిగితే... బాల‌య్య ఎందుకు కాదంటారు..?  సో.... చిరు, బాల‌య్య ఈ కార్య‌క్ర‌మానికి త‌ప్ప‌కుండా వ‌స్తార‌ని వార్త‌లు అందుతున్నాయి. అదే జ‌రిగితే... ఓపెనింగ్ అదిరిపోయిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS