వంద సినిమాల దర్శకుడిగా, దర్శకేంద్రుడిగా ఖ్యాతి తెచ్చుకున్నారు కె.రాఘవేంద్రరావు. `ఓం నమో వేంకటేశాయ` ఆయన చివరి సినిమా అన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా ఆయన్ని దారుణంగా నిరాశపరిచింది. అందుకే నిర్ణయం మార్చుకుని మరోసారి మెగాఫోన్ పట్టుకోవడానికి సిద్ధమయ్యారని టాక్.
రాఘవేంద్రరావు దర్శకుడిగా ఓ చిత్రం సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతోందని సమాచారం. `ఈ నగరానికి ఏమైంది` ఫేమ్ విశ్వాక్ కథానాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈషారెబ్బాని కథానాయికగా ఎంచుకున్నారని తెలుస్తోంది. స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.
గత కొన్నేళ్లుగా రాఘవేంద్రరావు ఆధ్యాత్మిక చిత్రాలవైపే ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈసారి.. ఓ విభిన్న ప్రేమకథని ఎంచుకున్నారని తెలుస్తోంది. `పెళ్లి సందడి` తరహాలో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ప్రేమకథ చెప్పబోతున్నారని టాక్.
మరి దర్శకేంద్రుడు ఎలాంటి కథతో వస్తారో చూడాలి.