బయోపిక్స్ హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ ఊసులోకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బయోపిక్‌లో లీడ్ రోల్ పోషించేదెవరు.? అనే దానిపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. తన బయోపిక్ తెరకెక్కించేందుకు తనకేం అభ్యంతరం లేదని చిరంజీవి మాటల్లో ఆర్ధమైపోయింది. అంతేకాదు, ఈ బయోపిక్‌ని ఘనంగా తెరకెక్కించేందుకు నిర్మాత రామ్‌చరణ్ కూడా సిద్ధంగానే ఉన్నాడు.
ఇక తెరపై చిరంజీవి పాత్ర పోషించే మెగా హీరో ఎవరనే అంశమే సస్పెన్స్‌గా మారింది. చరణ్ నటించనని చెప్పేశాడు. చిరంజీవి అభిప్రాయం కూడా అదే. ఇక ఆ పాత్రకు న్యాయం చేయగల సత్తా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి గానీ, వరుణ్ తేజ్‌కి గానీ ఉందని చిరు తన మనసులోని మాటను బయట పెట్టారు కూడా. ఇదంతా తెలిసిన ఊసే. తాజా న్యూస్ ఏంటంటే, సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం 'ప్రతిరోజూ పండగే' సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరు బయోపిక్ విషయమై మనసులోని మాట బయటపెట్టాల్సి వచ్చింది.
చిరంజీవి పాత్రకు తాను న్యాయం చేయలేనేమో అని మీడియా ముఖంగా అనుమానం వ్యక్తం చేశాడు. కానీ, మామయ్య చిరంజీవి, బావ చరణ్ చెబితే చెయ్యకుండా ఉండలేడు కదా. ఈ విషయంలో ఆడియన్స్ ఓటు కూడా తేజుకే. సో రియల్ మెగాస్టార్ లైఫ్‌కి రీల్ మెగాస్టార్ తేజునే అవుతాడా.? అనేది తెలియాలంటే, ఇంకాస్త సమయం వేచి చూడక తప్పదు.