సురేష్ బాబు తనయుడు అభిరామ్‌ని తెరపైకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ కథని ఫైనల్ చేసినా, చివరికి ఎందుకో అది పట్టాలెక్కలేదు. ఆ తరవాత అభిరామ్ ఎక్కువగా ప్రొడక్షన్ కే పరిమితమయ్యాడు. అయితే ఇప్పుడు అభిరామ్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నాడు సురేష్‌బాబు. ధనుష్ సినిమా `అసురన్`ని వెంకటేష్‌తో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అభిరామ్‌కి ఓ కీలకమైన పాత్ర అప్పజెప్పినట్టు తెలుస్తోంది.
ఈ సినిమా అభిరామ్‌కి ఓ డెమో లాంటిది. కెమెరా ముందు ఎలా కనిపిస్తాడు? అనే విషయాన్ని అంచనా వేయడానికి ఓ ట్రయిలర్‌గా వాడుకోబోతున్నాడట. ఈ సినిమాలో అభిరామ్ పాత్ర క్లిక్ అయితే... హీరోగా సినిమాలు తీయొచ్చన్న ప్లాన్‌లో ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కథానాయికగా శ్రియ ఎంపిక దాదాపుగా ఖాయమైంది.