గతవారం డల్‌గా సాగిన బిగ్‌బాస్‌లో ఈ వారం ఫుల్‌గా జోష్ వచ్చింది. వీకెండ్‌లో నాగార్జున ఇచ్చిన టాస్క్‌లతో హౌస్‌మేట్స్ అందరిలోనూ కొత్త జోష్ నిండింది. అదే జోష్‌తో నామినేషన్స్ పర్వాన్ని హుషారుగా కంప్లీట్ చేశారు. నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా, బాబా భాస్కర్ కారణంగా కొన్ని ఇష్యూస్ చోటు చేసుకున్నాయి హౌస్‌లో. అలీ, బాబా భాస్కర్, మహేష్ ఇలా మేల్ కంటెస్టెంట్స్ మధ్య, ఆషూ, హిమజ, పునర్నవి.. ఇలా ఫీమేల్ కంటెస్టెంట్స్ మధ్యనా కొన్ని డిఫరెన్సెస్ చోటు చేసుకున్నాయి.
ఇదిలా ఉంటే, తాజా ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కోసం పోటీ మొదలైంది. ఈ సారి హౌస్ కెప్టెన్ అయ్యే అవకాశం బిగ్‌బాస్ ఆడవాళ్లకు ఇచ్చారు. ఆ క్రమంలో శివజ్యోతి, వితికా కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడ్డారు. టాస్క్‌లో భాగంగా, స్విమ్మింగ్ పూల్ పైన గాల్లో కాస్సేపు వేలాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో వితికా స్టామినా కోల్పోయింది. మధ్యలోనే దించేయమని హౌస్‌మేట్స్‌ని కోరడంతో, చివరి వరకూ వేలాడి, విజేతగా నిలిచిన శివజ్యోతి కెప్టెన్సీ దక్కించుకుంది. అలా 30వ రోజు హౌస్‌లో కెప్టెన్ అయిన తొలి లేడీ కంటెస్టెంట్‌గా ఛాన్స్ కొట్టేసింది శివజ్యోతి అలియాస్ సావిత్రక్క.
ఇంతవరకూ వరుణ్ సందేశ్, అలీ రైజాలు కెప్టెన్స్‌గా కొనసాగారు. వీరిలో తొలి కెప్టెన్‌గా వరుణ్ తన బాధ్యతల్ని నిర్వర్తించడంలో విఫలమయ్యాడు. శిక్ష కూడా అనుభవించాడు. కానీ, అలీ మాత్రం 'బెస్ట్ కెప్టెన్' అని కాంప్లిమెంట్ తీసుకున్నాడు హోస్ట్ నాగార్జున నుండి. చూడాలి మరి, కెప్టెన్‌గా శివజ్యోతి ఎలాంటి పేరు తెచ్చుకుంటుందో, ఈమె కెప్టెన్సీలో బిగ్‌హౌస్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.!