గాడ్ ఫాద‌ర్ గా చిరంజీవి?

మరిన్ని వార్తలు

చిరంజీవి ప్ర‌స్తుతం `ఆచార్య‌` షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఆగ‌స్టులో కొత్త చిత్రం `లూసీఫ‌ర్‌` రీమేక్ ప‌ట్టాలెక్క‌బోతోంది. మోహ‌న్ రాజా దీనికి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం కోసం ప‌లు ర‌కాల టైటిళ్లు ప్ర‌చారంలో ఉన్నాయి. `రారాజు`, `కింగ్ మేక‌ర్‌` టైటిల్స్ లో ఒక‌టి ఫిక్స్ చేస్తార‌ని అన్నారంతా. అయితే ఇప్పుడు మ‌రో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదే.. `గాడ్ ఫాద‌ర్‌`.

 

గాడ్ ఫాద‌ర్ టైటిల్ ని చిరంజీవి కోసం రిజిస్ట‌ర్ చేయించార‌ని, చిరు కూడా ఈ టైటిల్ కే ఓటేశార‌ని స‌మాచారం అందుతోంది. ఆగ‌స్టు 10 నుంచి షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. 2022 వేస‌విలో విడుద‌ల చేస్తార‌ని తెలుస్తోంది. దీంతో పాటు బాబి సినిమాని కూడా ఒకేసారి ప‌ట్టాలెక్కించాల‌ని చిరు భావిస్తున్నాడు. ఇప్ప‌టికే బాబి.. చిరు కోసం ఓ క‌థ సిద్ధం చేసేశాడు. దానికి చిరు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS