ప‌వ‌న్ కోసం రానాకి అన్యాయం చేస్తున్నారా?

By Gowthami - July 28, 2021 - 16:20 PM IST

మరిన్ని వార్తలు

మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `అయ్య‌ప్ప‌యుమ్‌ కోషియమ్‌`. దీన్ని తెలుగులో ప‌వ‌న్‌, రానాల‌తో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌కుడు. త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌ల్ని అందిస్తున్నారు. ఇందులో ప‌వ‌న్ `హీమ్లా నాయక్‌`గా న‌టిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి కూడా అదే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

 

మ‌ల‌యాళంలో `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌`... అప్ప‌య్య‌.. కోషియ‌మ్ అనే ఇద్ద‌రి క‌థ‌. ఆ రెండు పాత్ర‌ల్లో బీజూ మీన‌న్‌, పృథ్వీరాజ్ న‌టించారు. రెండు పాత్ర‌ల‌కూ స‌మాన స్థాయి ఉంది. కాబ‌ట్టి.. ఆ రెండు పాత్ర‌ల పేర్లే టైటిల్ గా పెట్టారు. తెలుగులోనూ అలానే జ‌రుగుతుంద‌ని అనుకున్నారంతా. అయితే.. కేవ‌లం టైటిల్ గా ప‌వ‌న్ పాత్ర పేరే ఫైన‌ల్ కావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ సినిమాలో ప‌వ‌న్ - రానా ఇద్ద‌రి పాత్ర‌లూ స‌మాన‌మైన‌ప్పుడు ఒకరి పేరే టైటిల్ గా ఫైన‌ల్ చేయ‌డం ఏమిటి? అనిపిస్తుంది. అంటే.. ప‌వ‌న్ కోసం రానా పాత్ర‌ని త‌క్కువ చేస్తున్నారా? రానా పాత్ర‌కు అన్యాయం చేస్తున్నారా? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

 

ఈ సినిమా స్క్రిప్టు బాధ్య‌త త్రివిక్ర‌మ్ పై పెట్టారు. త్రివిక్ర‌మ్ ప‌వ‌న్‌కి మంచి దోస్త్‌. త‌న స్నేహితుడి కోసం.. స్క్రిప్టుని ఆయ‌న క‌చ్చితంగా మార్చి రాస్తారు. పైగా ప‌వ‌న్‌కి ఉన్న ఇమేజ్ వేరు. ఇది మ‌ల్టీస్టార‌రే అయినా... అభిమానులు మాత్రం దీన్ని ప‌వ‌న్ సినిమాగానే చూస్తారు. అందుకే ఇలాంటి మార్పులు త‌ప్ప‌నిస‌రి. కాక‌పోతే.. టైటిల్ విష‌యంలోనైనా రానాకి న్యాయం జ‌ర‌గాలి క‌దా.. అన్న‌ది ద‌గ్గుబాటి అభిమానుల మాట‌. ఈ విష‌యంలో చిత్ర‌బృందం ఏ నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS