మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గడ్డం, మీసం తీసేసి చిరంజీవి కొత్త గెటప్‌తో కన్పిస్తుండడం సినీ వర్గాల్లోనూ సంచలనంగా మారింది. 'సైరా నరసింహారెడ్డి' సినిమా కోసం గడ్డం, మీసం బాగా పెంచేసి కనిపించిన చిరంజీవి, ఒక్కసారిగా క్లీన్ షేవ్‌తో, మీసంతో కనిపించేసరికే అంతా ఆశ్చర్యపోయారు. ఇంకొందరైతే 'సైరా' సినిమా ఆగిపోయిందన్నారు.
ఈలోగా చిరంజీవి ఆ మీసం కూడా తీసేసి కనిపించడం సంచలనమే అయ్యింది. ఎందుకిలా? అని ఆరా తీస్తే, ఇది కూడా 'సైరా నరసింహారెడ్డి' కోసమేనట. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తోన్న ఈ సినిమాకి గ్రాఫిక్స్ తప్పనిసరి. 'బాహుబలి' సినిమా కోసం అనుష్క ఫేస్ ఫీచర్స్‌ని సీజీలో డిజైన్ చేయడానికి మాస్క్ తయారుచేశారు. అలాగే ఇప్పుడు చిరంజీవి విషయంలోనూ జరుగుతోందట. దానికోసమే చిరంజీవి ఇలా మీసం, గడ్డం తీసేసి కనిపించబోతున్నారని తెలియవస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సైరా' సినిమా తొలి షెడ్యూల్ గత నెలలోనే కంప్లీట్ చేసుకుంది.
వచ్చే నెలలో మళ్ళీ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఈసారి చిరంజీవి గడ్డం లేకుండా, మీసంతో కనిపిస్తారని సమాచారమ్. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ ఈ సినిమాని అత్యంత భారీగా నిర్మించబోతున్నాడు. బడ్జెట్ పరంగా తెలుగు సినీ పరిశ్రమలోనే ఇది అతి పెద్ద సినిమా కానుంది.