తన రీ-ఎంట్రీ తో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన 151వ సినిమాతో అవే రికార్డులను చెరిపేయడానికి సిద్ధం అవుతున్నాడు.
అందుతున్న సమాచారం ప్రకారం, సినిమా కథ కూడా ఫైనల్ చేసేశారు. ఇక కథ ప్రకారంగా, చిరు రెండు పాత్రల్లో కనువిందు చేయనున్నాడట. ఒకటేమో టైటిల్ పాత్ర మరొకటేమో ఆ టైటిల్ పాత్ర గురించి మనకు చెప్పే పాత్ర, అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక ఖైదీ నెం 150లో కూడా ద్విపాత్రాభినయంతో రెచ్చిపోయిన చిరు, ఈ 151లో కూడా అదే తరహాలో కుమ్మేస్తాడని ఆశిద్దాం.