అలనాటి మేటి నటి మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన మహానటి చిత్రం ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ సినిమా చూసిన సామాన్యుడి దగ్గరి నుండి సెలబ్రిటీ వరకు అందరూ ఈ చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
ఇక ఈ చిత్రాన్ని కేవలం పొగడ్తలతో మాత్రమే ముంచెత్తకుండా స్వయంగా టీంని తన ఇంటికి పిలిపించుకుని మరి సత్కరించి పంపించారు మెగాస్టార్ చిరంజీవి. ఊరికే సత్కరించడమే కాకుండా మహానటి చిత్రంలో ఆయనకి నచ్చిన అంశాలని చెప్పడం అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ ని అసలు ఈ చిత్రం ఎందుకు తీయాలనిపించింది అని అడగడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇదే సమయంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తనకి నచ్చే కథ గనుక చెప్పగలిగితే త్వరలోనే తమ కలయికలో అశ్విని దత్ నిర్మాణంలో ఒక సినిమా ఉండబోతుంది అని కూడా చెప్పడం గమనార్హం. ఏదేమైనా ఒక మంచి చిత్రం తీయడంతో నాగ్ కి కెరీర్ తొలిదశలోనే మెగాస్టార్ తో సినిమా అవకాశం తెచ్చిపెట్టింది.
ఏదేమైనా.. నాగ్ అశ్విన్ లక్కీ అనే చెప్పొచ్చు.