మొత్తానికి అర్జున్ రెడ్డి రీమేక్ ఫిక్స్ అయింది

By iQlikMovies - May 12, 2018 - 18:41 PM IST

మరిన్ని వార్తలు

గత సంవత్సరం మనముందుకు వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఇక అలాంటి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తారు అన్న వార్తలు ఇక్కడ విడుదల అయినప్పట్టి నుండే వినిపిస్తున్నాయి.

ముందుగా ఈ చిత్రాన్ని హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తుంది అని అందులో ప్రముఖ నటుడు రన్వీర్ సింగ్ నటిస్తాడు అని ఊహాగానాలు వచ్చాయి. దర్శకుడు సందీప్ కూడా ఈ విషయాన్నీ దాదాపుగా ద్రువీకరించాడు. అయితే ఆ ఊహాగానాలు తరువాత కాలంలో కార్యరూపం దాల్చలేదు.

ఇంతలో మళ్ళీ ఈ రీమేక్ లో నటించడానికి మరో బాలీవుడ్ స్టార్ హీరో ఆసక్తి చూపించాడు. ఆయన మరెవరో కాదు- షాహిద్ కపూర్. ఇక ఈ రీమేక్ ని తెలుగు వెర్షన్ కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగ నే దర్శకత్వం వహించనున్నాడు.

మొత్తానికి ఈ రీమేక్ పట్టాలేక్కనుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS