ఛలో ‘మెగా ప్రీమియర్’ కి ఏర్పాట్లు

మరిన్ని వార్తలు

నాగ శౌర్య నటించడమే కాకుండా నిర్మాతగా మారి చేసిన చిత్రం ఛలో. ఈ చిత్రం వచ్చే శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

 

మొన్నీమధ్యనే ఛలో ప్రీ-రిలీజ్ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి రావడం ఈ చిత్రం విజయవంతం కావాలని ఆశీర్వదించడం అలాగే తనని తాను నాగ శౌర్య లో చూసుకుంటున్నట్టు కూడా చెప్పడంతో అనగా శౌర్య ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

ఇక ఇందుకు కృతజ్ఞతగా ఈ ఛలో చిత్రాన్ని విడుదలకి ముందు రోజే మెగాస్టార్ చిరంజీవికి ‘మెగా ప్రీమియర్’ రూపంలో ఇవ్వనున్నట్టు సమాచారం. దీనితో విడుదలకి ముందురోజే ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ ద్వారా విడుదల కాబోతున్నదనమాట.

మొత్తానికి ఈ ఛలో చిత్రానికి మెగా అండదండలు పూర్తిగా ఉండటం అలాగే ఈ సినిమాలో కూడా కంటెంట్ ఫ్రెష్ గా ఉండడంతోఈ సినిమా పక్కా హిట్ అన్న టాక్ మొదలయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS