చిరు సినిమాలో ఈ ఇద్ద‌రూ ఉన్నారా?

మరిన్ని వార్తలు

చిరంజీవి ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. `ఆచార్య‌` విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈలోగా `గాడ్ ఫాద‌ర్‌`ని మొద‌లెట్టేశారు. మ‌ల‌యాళంలో విజ‌య‌వంత‌మైన `లూసీఫ‌ర్‌`కి ఇది రీమేక్‌. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఊటీలో చిత్రీక‌రణ ప్రారంభ‌మైంది. చిరు మిన‌హాయిస్తే, ఈ సినిమాలో న‌టించే ఇత‌ర న‌టీన‌టుల వివ‌రాలు ఇంకా తెలియ‌లేదు. ఓ కీల‌కమైన పాత్ర‌లో స‌ల్మాన్ ఖాన్ క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంపై చిత్ర‌బృందం గ‌ప్ చుప్ గా ఉంది.

 

అయితే ఇప్పుడు గాడ్ ఫాద‌ర్ లో న‌టించబోతున్న ఇద్దరు న‌టీమ‌ణుల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అందులో ఒక‌రు... వెట‌ర‌న్ హీరోయిన్ శోభ‌న‌. మ‌ల‌యాళంలో మంజువారియ‌ర్ పోషించిన పాత్ర‌లో శోభ‌న న‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరు - శోభ‌న‌ల‌ది విజ‌య‌వంత‌మైన కాంబినేష‌న్. సూప‌ర్ హిట్ సినిమా `రౌడీ అల్లుడు`లో శోభ‌న ఓ క‌థానాయిక‌గా న‌టించింది. చిరుకి ఎంతో పేరు తీసుకొచ్చిన `రుద్ర‌వీణ‌`లోనూ త‌నే క‌థానాయిక. ఇన్నాళ్ల‌కు మ‌ళ్లీ చిరు సినిమాలో న‌టించ‌బోతోంద‌న్న‌మాట‌. మ‌రో కీల‌కమైన పాత్ర‌లో శ్రియ‌ని తీసుకున్నార‌ని తెలుస్తోంది. చిరు - శ్రియ‌లు `ఠాగూర్‌`లో జ‌ట్టు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అదీ సూప‌ర్ హిట్ సినిమానే. అలా.. సూప‌ర్ హిట్ సెంటిమెంట్ ని ఈ సినిమాలోనూ కొన‌సాగిస్తున్నార‌న్న‌మాట‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS