మలయాళంలో సూపర్ హిట్టయిన `లూసీఫర్`ని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన చాలా కాలం క్రిందటే వచ్చింది. కానీ సెట్స్‌పైకి మాత్రం చాలా ఆలస్యంగా వెళ్లింది. అయితేనేం..? చిత్రీకరణ జెట్ స్పీడుతో సాగిపోతోంది. ఇప్పటికి దాదాపుగా 45 శాతం షూటింగ్ పూర్తయ్యిందని దర్శఖుడు మోహన్ రాజా అప్ డేట్ ఇచ్చేశారు. చిరంజీవికి సంబంధించిన సోలో సీన్స్ అన్నీ చిత్రీకరించేశార్ట. రెండు ఫైట్స్ కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు కాంబినేషన్ సీన్లు బాకీ. జనవరి - ఫిబ్రవరిలో షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. మార్చి నాటికి.. పోస్ట్ ప్రొడక్షన్ పనులూ అయిపోతాయి. అంటే.. వేసవికి గాడ్ ఫాదర్ సినిమారెడీ అన్నమాట. ఈ లెక్కన.. ఈ సినిమాని చాలా స్పీడుగా తీసేసినట్టే.
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ కాల్షీట్లు కనీసం వారం రోజులైనా కావల్సి ఉంటుంది. అదెప్పుడు దొరుకుతాయి? అనేది ప్రధానమైన సమస్య. సల్మాన్ పార్ట్ పూర్తయిపోతే... ఓ పెద్ద ఎపిసోడ్ పూర్తయినట్టే. అందుకే సల్మాన్ ఖాన్ డేట్ల కోసం చిత్రబృందం గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.