చిరు బ్లాక్ బస్టర్ సీక్వెల్స్ పై అప్డేట్

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అనేక అద్భుత చిత్రాలున్నాయి. ప్రజంట్ ట్రెండ్ కి అనుగుణంగా వాటికి సీక్వెల్స్ వస్తే బాగుంటుంది అని ఫాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వీటిలో ముఖ్యంగా తరచుగా వినిపించే పేర్లు ‘ఇంద్ర‌’, ‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’. జగదేక వీరుడు కి సీక్వెల్ వస్తుంది అని , చెర్రీ, జాన్వీ కపూర్ జంటగా నటిస్తారని పలు మార్లు రూమర్లు వచ్చాయి. కానీ ఎప్పుడు కార్య రూపం దాల్చలేదు. దీనితో ఈ సీక్వెల్ పై మెగా ఫాన్స్ , సినీ ప్రియులు నిరాశగా ఉన్న ఈ తరుణంలో అశ్వనీ దత్ మంచి అప్డేట్ ఇచ్చారు. 


జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, సినిమాలు రెండిటికి అశ్వనీ దత్ నిర్మాత. వైజయంతి బ్యానర్లో తెరెకెక్కిన ఈ మూవీస్ కి సీక్వెల్ అనౌన్స్ చేశారు అశ్వనీ దత్. చిరు బర్త్ డే సంద‌ర్భంగా ఆగ‌స్టు 22న ఇంద్ర రిరీలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. రీరిలీజ్ లోను ఇంద్రా మూవీ రికార్డ్ సాధించింది. 7  కోట్లకి పైగా వసూళ్లు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంద్ర రీరిలీజ్ సందర్భంగా చిరంజీవి మూవీ టీమ్ ని ఇంటికి పిలిచి సన్మానించారు. ప్రొడ్యూసర్ అశ్వినీ దత్, ద‌ర్శ‌కుడు బి.గోపాల్, పరుచూరి బ్రదర్స్, మణిశర్మ, రైట‌ర్‌ చిన్ని కృష్ణ పలువురు చిరు ఇంటికి వెళ్లారు.  అశ్వినీద‌త్‌కు పాంచ‌జ‌న్యాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు చిరు. తరవాత ఇంద్ర మూవీ జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. 


ఈ అద్భుత మూమెంట్ కి సంబందించిన వీడియోని తాజాగా వైజయంతి మూవీస్ రిలీజ్ చేసింది. “ఇంద్ర భ‌వ‌నంలో స‌త్కారం” పేరిట రిలీజ్ చేసిన ఈ వీడియోలో నిర్మాత అశ్వనీ దత్ మాట్లాడుతూ 'చిరు రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. ‘ఇంద్ర’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలకు సీక్వెల్స్ తీస్తానని పేర్కొన్నారు. ఈ రెండు సీక్వెల్స్ పై ఫాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారని, తొందరలోనే మిగతా డిటైల్స్ చెప్తానని మాటిచ్చారు. ఇది విన్న మెగా ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఒకేసారి చిరు రెండు సినిమా సీక్వెన్స్ అప్డేట్స్ రావటంతో పండగ చేసుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS