చిరంజీవి చక్కగా మాట్లడతారు. చిరు తెలుగు బావుటుంది. ఎవరిని ప్రశంసించిన చక్కని పోలికలు తీసుకొస్తారు. ఆచార్య ప్రీరిలీజ్ ఈవెంట్ లో రాజమౌళిని ఉద్దేశించిన చిరు తెచ్చిన ఓ పోలిక అద్భుతంగా వుంది. 'ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అనే చూపించారు.చాలా బాధగా అనిపించేది. కానీ ఇప్పుడు మనం గర్వపడేలా తెలుగు సినిమా హద్దులు, ఎల్లలు చెరిపేసి, ఇండియన్ సినిమా అని గర్వపడేలా ‘బాహుబలి’,
‘ఆర్‌ఆర్‌ఆర్’ చరిత్ర సృష్టించాయి. అలాంటి సినిమాల సృష్టి కర్త రాజమౌళి ఇక్కడ ఉండటం గర్వకారణం. తెలుగు సినిమా రాజమౌళిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు'' చిరు. ఇక్కడే ఓ మంచి పోలిక తెచ్చారు. ''భారతీయ సినిమా ఒక మతం అయితే, ఆ మతానికి పీఠాధిపతి రాజమౌళి'' అన్నారు మెగాస్టార్. నిజానికి సరైన పోలిక ఇది. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంతా తెలుగు సినిమా వైపు చూస్తుందంటే కారణం రాజమౌళినే. అంతేకాదు ఇండియన్ సినిమా స్టామినా పెంచిన దర్శకుడున్ రాజమౌళి. అలాంటి రాజమౌళిని సినిమా మతానికి పీఠాధిపతి అనడం సరైన పోలికే.