రాజమౌళి కెరీర్ చేసిన మొదటి పెద్ద సినిమా మగధీర. అంతకుముందు రాజమౌళికి విజయాలు వున్నాయి కానీ భారీ స్కేల్ లో చేసిన సినిమా మాత్రం మగధీరనే. ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి స్టామినా ఏమిటో అందరికీ తెలిసొచ్చింది. ఆయన ఎలాంటి అద్భుతాలు చేయగలడో తెలిసింది. అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రాజమౌళికి కొన్ని భయాలు వున్నాయి. చిరంజీవిగారబ్బాయితో సినిమా అంటే అన్ని చిరు ఇష్టం ప్రకారమే జరుగుతాయోననే రాజమౌళి భావించారట.
ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ఆచార్య ఈవెంట్ లో చెప్పారు. ‘మగధీర’ సమయంలో చిరంజీవిగారు కథ విన్నారు. ప్రతి విషయంలోనూ ఆయనే నిర్ణయాలు తీసుకుంటారని అనుకున్నా. కానీ నేను అనుకున్నది తప్పు. చరణ్ తన సినిమాల విషయంలో చిరు ఎలాంటి సలహాలు ఇవ్వరు. అన్నీ చరణే నిర్ణయాలే ఉంటాయి. తప్పులు జరిగితే సరిదిద్దుకుని నేర్చుకునే అవకాశం ఇస్తారు తప్పితే చరణ్ సినిమాల విషయంలో చిరంజీవి గారి జోక్యం వుండదు'' అని చెప్పుకొచ్చారు రాజమౌళి.