మలయాళంలో సూపర్ హిట్టయిన చిత్రం `లూసీఫర్`. తెలుగులో `గాడ్ ఫాదర్`గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడు. మోహన్ రాజా దర్శకుడు. ఇటీవలే ఊటీలో ఈ చిత్రం ప్రారంభమైంది. చిరు తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించడంతో షూటింగ్ మొదలెట్టారు. మరో వారం రోజుల పాటు షూటింగ్ ఊటీలోనే. అయితే సడన్ గా చిరంజీవి ఊటీ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. చిరు సడన్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇటీవల పవన్ కల్యాణ్ చిత్రసీమకు సంబంధించిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అవి చిరుని బాగా హర్ట్ చేశాయని తెలుస్తోంది. అందుకే పవన్ తో మాట్లాడాలన్న ఉద్దేశ్యంతో ఆయన హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారిన చెప్పుకుంటున్నారు. మరోవైపు చిరుకి సంబంధించిన షూటింగ్ అయిపోయిందని, అందుకే ఆయన హైదరాబాద్ వచ్చేశారని అంటున్నారు. ఏదేమైతేనేం... చిరు ఇప్పుడు ఊటీ వదిలి హైదరాబాద్ వచ్చేశారు. ఒకట్రెండు రోజుల్లో చిరు పవన్‌తో భేటీ అయితే... చిరు రాకకి కారణం పవనే అని అనుకోవొచ్చు. లేదంటే.. గాడ్ ఫాదర్ షూటింగ్ అవ్వగొట్టే, చిరు వచ్చారని అర్థం చేసుకోవాలి.