`నాకేమైనా అయితే పవన్ కల్యాణ్ దే బాధ్యత. తనపై కేసు పెడతా...` అంటూ ఆగ్రహావేశాలతో ఊగిపోయాడు పోసాని కృష్ణ మురళి. ఈరోజు అంటే... బుధవారం పవన్ కల్యాణ్‌పై పోసాని పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయితే అంతకు ముందే పోసానిపై జనసేన పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ జనసేన ఇంఛార్జ్ శంకర్ గౌడ్ పంజగుట్టా పోలీసు స్టేషన్ లో పోసానిపై ఫిర్యాదు చేశారు.
పోసాని ప్రెస్ మీట్లలో వాడే భాష అభ్యంతర కరంగా ఉందని, చాలామంది మనోభావాల్ని దెబ్బ తీస్తోందని, ఓ పార్టీ నాయకుడ్ని కించ పరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు... పోసానిని ప్రెస్ మీట్ల నుంచి బహిష్కరించాలని తెలంగాణ మీడియాని ఆయన కోరారు. పంజాగుట్టలో మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల పోసానిపై పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయని సమాచారం. పవన్ కల్యాణ్ అభిమానులంతా... పోసానిపై ఈ విధంగా నిరసన తెలియజేయాలని చూస్తున్నార్ట. పోసాని పవన్ పై పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు... పోసానిపైనే వందల కొద్దీ ఫిర్యాదులు నమోదు చేయడమే జనసేన లక్ష్యంగా మార్చుకుంది. రాబోయే రెండు మూడు రోజుల్లో పోలీసుల స్టేషన్లలో పోసాని పంచాయితీనే ఎక్కువ కనిపించబోతోంది.