ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీసం అదిరెలే!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్‌ 150'లో చిరంజీవి ఎంట్రీలో 'నేనెలా ఉన్నాన్రా' అని అడిగితే, ఆలీ 'నీలాగే ఉన్నావ్‌..' అని కొంటెగా సమాధానమిస్తాడు. ఆ డైలాగ్‌ ప్యాన్స్‌కి బాగా నచ్చేస్తుంది. అభిమాన హీరో ఎంట్రీ అదిరిపోయిందే అని ఈలలు గోలలతో ఆ సినిమా సూపర్‌ హిట్‌ చేసేశారు. అలా మన బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అయిపోయారు. అది సరే తాజాగా 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి' కోసం మాత్రం చిరంజీవి న్యూ గెటప్‌ ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్‌ మీదికి వెళ్లనుంది ఈ సినిమా.  

ఈ సినిమాలో చిరంజీవి ఏ గెటప్‌లో కనిపించనున్నారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు కానీ, ఈ మధ్య చిరు ఎక్కడ కనిపించినా ఆయన ఓ డిఫరెంట్‌ మీస కట్టుతో దర్శనమిస్తున్నారు. ఈ స్టైల్‌ 'సైరా నరసింహారెడ్డి' కోసమేనంటూ చర్చలు జరుగుతున్నాయి. తాజాగా ఆయన సమంత, నాగచైతన్యల వెడ్డింగ్‌ రిసెప్షన్‌కి హాజరయ్యారు. ఆ వేడుకకు చిరంజీవి స్పెషల్‌ అట్రాక్షన్‌ కాగా, ఆయన మీసం ఫ్యాన్స్‌ని మరింత ఎట్రాక్ట్‌ చేసింది. సినిమాలో చిరు ఈ మీసకట్టుతోనే కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. తొలి స్వాతంత్య్ర సమరమోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోందీ చిత్రం. 

ఈ చిత్రంలో సెట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే పలు రకాల సెట్స్‌ని ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్‌. భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. టాలీవుడ్‌ నుండే కాక, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మలయాళం నుండి తదితర అగ్ర కథానాయకులు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS