మేము రాజకీయాలకి పనికిరాము: ప్రకాష్ రాజ్

మరిన్ని వార్తలు

ఈమధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చే సినీతారల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంగా సామాజిక అంశాల పైన ఎక్కువగా ఆసక్తి చూపే నటుడు ప్రకాష్ రాజ్ కూడా త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నాడు అన్న ప్రచారం మొదలైంది.

అయితే ఇదే విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా, అతను చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. అదేంటంటే- సినీనటులు అసలు రాజకీయాలకి పనికిరారు అని వారు రాజకీయాల్లోకి వస్తే సదరు స్టార్ ని అభిమానించే వారు ఒక స్టార్ గానే చూస్తారు తప్ప ఒక నాయకుడిగా చూడరు అని చెప్పాడు.

దీనివల్ల ప్రజలకి జరగాల్సిన మంచి జరగకపోగా తీవ్ర నష్టం వాటిల్లే ఆస్కారం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అందుకే తాను రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదు అని స్పష్టం చేసాడు.

మరి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న సినీప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS