మహేష్‌బాబు చేతిలో `సర్కారు వారి పాట` ఉంది. రాజమౌళి `ఆర్.ఆర్.ఆర్`తో బిజీగా ఉన్నాడు. ఇదయ్యాక... వీరి కాంబినేషన్ లో సినిమా అని ప్రచారం జరుగుతోంది. మహేష్, రాజమౌళి కూడా ఇదే మాట చెప్పారు. `ఆర్.ఆర్.ఆర్` అయ్యాక... రాజమౌళి చేసేది మహేష్ తోనే. అయితే మహేష్ బాబు ప్లానింగ్ మాత్రం వేరే. `సర్కారు వారి పాట`కీ... రాజమౌళి సినిమాకీ మధ్యలో మరో సినిమా పూర్తి చేయాలనుకుంటున్నాడు. రాజమౌళి కంటే ముందు త్రివిక్రమ్ ఓ ఓ సినిమా ఫిక్స్ చేసేశాడు మహేష్ బాబు.
`అల వైకుంఠపురములో` తరవాత ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఈ ఉగాదికి లాంఛనంగా ప్రారంభం అవుతుంది. 2022 ఏప్రిల్ లో విడుదల అవుతుంది. ఆ వెంటనే... మహేష్ తో ఓ సినిమా చేస్తాడట. ఈసినిమా అత్యంత వేగంగా పూర్తి చేయాలన్నది ప్లాన్. 2022 ఆగస్టునాటికి సినిమా పూర్తి చేస్తే... ఆ వెంటనే రాజమౌళి సినిమా మొదలెడతాడు మహేష్. అంటే.. 2022లో మహేష్ నుంచి రెండు సినిమాలొస్తాయి.
`ఆర్.ఆర్.ఆర్` ఈ యేడాదే విడుదల అవుతోంది. అంటే.. మహేష్ తో సినిమా కోసం మరో ఏడాది రాజమౌళి సినిమా చేయకుండా ఉండిపోతాడన్నమాట. తన ప్రతీ సినిమాకీ కొంత విరామం తీసుకోవడం రాజమౌళికి మామూలే. అయితే ఈసారి ఏకంగా ఏడాది పాటు ఖాళీ అన్నమాట. మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటి వరకూ రెండు సినిమాలొచ్చాయి. ఇది హ్యాట్రిక్ అవుతుంది.