మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాల్లో మలయాళం ''లూసిఫర్'' కూడా చేరింది. ఈ సినిమాకి సుజిత్ దర్శకుడని స్వయంగా చిరు వెల్లడించారు. దీనితో లూసిఫర్ రీమేక్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పటికే మలయాళం వెర్షన్ చూసిన కొందరు మెగాఫ్యాన్స్ ఈ సినిమాని వున్నది వున్నట్లు తీస్తే.. ఇక్కడ అభిమానులకు నచ్చకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి లూసిఫర్ మంచి కధే. అయితే అది మెగాస్టార్ కి ఎంతవరకూ నప్పుతుందా అనేది ఇక్కడ ప్రశ్న.
కధ ప్రకారం.. ఇందులో హీరో పాత్ర.. సినిమా మొదలైన అరగంట తర్వాత ఎంట్రీ ఇస్తుంది. అదీ కూడా చాలా సాదాసీదాగా. ఇందులో హీరోయిన్ కి ఛాన్స్ లేదు. ఒక వేళ మెగాడ్యాన్సల కోసం పెడితే మాత్రం హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది. ఎందుకంటే లూసిఫర్ లో హీరో క్యారెక్టర్ అలాంటిది. అంతేకాదు.. ఇందులో విలన్ కి కీ రోల్ వుంటుంది. అయితే ఆ విలన్ డైరక్ట్ గా హీరోతో తలపడడు. హీరో చెల్లిని రెండో పెళ్లి చేసుకుంటాడు. అంతకుముందే ఆ చెల్లి ఓ కూతురు వుంటుంది. ఆ కూతురిని అనుభవించాలని అనుకుంటాడు విలన్. ఇదంతా ఆ ఫ్యామిలీ ఎఫైర్. హీరో చివర్లో విలన్ ని చంపేస్తాడు. అది వేరే విషయం.
అయితే ఇలాంటి ట్రాక్.. మెగాస్టార్ కధలో వూహించలేము. అంతేకాదు ఇందులో హీరో ఓ నింద మోయాల్సివస్తుంది. ఓ అనాధ పిల్లని గర్భం చేసిన నింద. ఇలాంటి నిందలు మోయడానికి మెగాస్టార్ సిద్దంగా వుంటారేమో కానీ ఆయన అభిమానులకు ఇది జీర్ణం కాదు. ఇంకొ మాట.. కధ ప్రకారం.. ఇందులో హీరో మాఫియా డాన్.. అయితే ఇది కేవలం బిల్దఫ్ కి మాత్రమే వాడారు. ఒక్క సీన్ కూడా వుండదు. చివర్లోసీక్వెల్ కి అన్నట్టు డాన్ లుక్ లో చూపించి వదిలేస్తారు. ఇలాంటి కధని ఇప్పుడు మెగాస్టార్ ఒప్పుకున్నారు. అయితే ఇందులో చాలా మార్పులు జరగాలి. వున్నది వున్నట్లు తీస్తేమటకు రీమేక్ కాస్త అభిమానుల తలలో మేకు అయ్యే ఛాన్స్ పుష్కలంగా వుంది.