పవన్‌ భక్తుడిని మెగాస్టార్‌ కరుణిస్తారా?

మరిన్ని వార్తలు

పవన్‌కళ్యాణ్‌కి అరివీర భయంకరుడైన భక్తుడు హరీష్‌ శంకర్‌. ఈ విషయంలో అతనికి సాటి ఇంకెవరూ రారేమో. వీలు చిక్కినప్పుడల్లా పవన్‌కళ్యాణ్‌ మీద హరీష్‌ శంకర్‌ తన అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. పవన్‌కళ్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్‌' సినిమాని తెరకెక్కించి, సూపర్‌ హిట్‌ కొట్టి, పవన్‌ అభిమానిగా తన సత్తా రాటి, పవన్‌కళ్యాణ్‌ అభిమానులు కాలరెగరేసుకునేలా చేశాడు ఈ యంగ్‌ డైరెక్టర్‌. పవన్‌కళ్యాణ్‌కి అభిమాని అంటే, మెగాస్టార్‌ చిరంజీవికి వీరాభిమాని కాకుండా ఉంటాడా? అసలంటూ చిరంజీవి నుంచే కదా, పవన్‌కళ్యాణ్‌కీ సినీ లెగసీ వచ్చింది. అందుకే మెగాస్టార్‌ మీద తనకున్న అభిమానం నేపథ్యంలో, చిరంజీవి ఇమేజ్‌కి తగ్గ కథని ఎప్పుడో రెడీ చేసుకున్నాడట. చిరంజీవి ఛాన్సిస్తే తన సత్తా చాటుతానంటున్నాడు. చిరంజీవి కూడా తన ఇమేజ్‌ ఎలివేట్‌ అయ్యే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా అలా వచ్చిందే. సో హరీష్‌ శంకర్‌ని మెగాస్టార్‌ కరుణించడం అతి త్వరలోనే జరగొచ్చు. ఈ మధ్యనే వచ్చిన 'డిజె'తో హిట్టు కొట్టాడు హరీష్‌ శంకర్‌. ఈ యంగ్‌ డైరెక్టర్‌ మెగా ఫ్యామిలీలో ఇప్పటికే ముగ్గురు హీరోలతో సినిమాలు చేసేశాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్‌తో 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమా చేసేశాడు కదా. మూడూ హిట్‌ సినిమాలే. ఇక నెక్స్ట్‌ చిరంజీవిదే వంతు. ప్రస్తుతం చిరంజీవి సురేందర్‌ రెడ్డి సినిమా కోసం ప్రిపేర్‌ అవుతున్నారు. ఏమో చిరు కరుణిస్తే నెక్స్ట్‌ సినిమాకే హరీష్‌ శంకర్‌కి ఛాన్స్‌ వచ్చేసినా ఆశ్యర్యపోనక్కర్లేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS