టెన్షన్‌ పెంచేస్తోన్న 'స్పైడర్‌'

మరిన్ని వార్తలు

మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'స్పైడర్‌'. మురుగదాస్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల విషయంలోనే సస్పెన్స్‌ నెలకొంది. ఆగష్టులో ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావించింది. కానీ కుదరలేదు. అది సెప్టెంబర్‌కి వెళ్లింది. కానీ సెప్టెంబర్‌లో విడుదలకు ఎన్టీఆర్‌ 'జై లవకుశ', బాలయ్య 'పైసా వసూల్‌' సినిమాలు రెడీగా ఉన్నాయి. స్లాట్స్‌ బుకింగ్‌ అయిపోయాయి ఈ సినిమాలకి. సో వీటి మధ్య 'స్పైడర్‌' ఇమిడే అవకాశం లేదు. ఆ కారణంగా మహేష్‌ 'స్పైడర్‌' సెప్టెంబరులో విడుదలయ్యేందుకు అవకాశాలు కనిపించడం లేదు. ఈ సినిమా బైలింగ్వల్‌ మూవీ. తెలుగుతో పాటు, తమిళంలో కూడా ఏకకాలంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. మహేష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీగా తెరకెక్కుతోంది ఈ సినిమా. ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో మహేష్‌ తొలిసారిగా తమిళంలోకి అడుగుపెడుతున్నాడు. తమిళ డైరెక్టర్‌ కమ్‌ హీరో ఎస్‌.జె.సూర్య విలన్‌గా నటిస్తుండగా, తమిళ యంగ్‌ హీరో భరత్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మరో పక్క ఈ సినిమా సెప్టెంబరులో విడుదల కానుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ డైరెక్టర్‌ మురుగదాస్‌ నుండి కానీ, మహేష్‌ నుండి గానీ సెప్టెంబరు విడుదల విషయంలో అధికారకి ప్రకటన ఏమీ రాలేదు. సో ఈ సినిమా దసరాకి వస్తుందో లేదో అనే సంగతి అనుమానమే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS