మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున మంచి స్నేహితులు. అయితే తమ స్నేహాన్ని చాటుకోవడానికి ఈ తాజా సంఘటన ఆదర్శంగా నిలిచింది. ఈ రోజు నాగార్జున నటించిన 'నమో వేంకటేశాయ' చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమా ప్రీమియర్ షోకి చిరంజీవి హాజరయ్యారు. సినిమాని చూసి చాలా బాగుందని నాగార్జునని చిరంజీవి ప్రశంసించారు. ఆయన నటన చాలా అద్భుతంగా ఉందన్నారు. సినిమా చూస్తున్నంత సేపూ తెలీని అద్భుతమైన అనభూతికి లోనయ్యానని చిరంజీవి అన్నారు. ఒక హీరోని మరో హీరో ప్రమోట్ చేయడం అనేది ఇంతవరకూ బాలీవుడ్‌లోనే చూశాం. కానీ తాజాగా చిరంజీవి, నాగార్జునల కారణంగా నేడు టాలీవుడ్‌లో కూడా ఈ సాంప్రదాయం స్టార్ట్ అయ్యింది. ఈ స్నేహ పూర్వక వాతావరణం టాలీవుడ్‌లో స్వాగతించదగ్గదే. ఇలా చేయడం వల్ల తెలుగు సినీ పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ఇది చాలా శుభ పరిణామం. ఈ ఆత్మీయ కలయికతో ఇటు అక్కినేని అభిమానులు, అటు మెగా అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ అభిమానుల మధ్యే డిఫరెన్సెస్. కానీ హీరోల మధ్య స్నేహభావమే ఉంటుంది అని చాలా సార్లు హీరోలు తెలిపారు. ఈ రోజు చిరంజీవి, నాగార్జునల కలయికతో ఇది మరోసారి ప్రూవ్ అయ్యింది. నాగార్జున హథీరామ్ బాబా పాత్రలో నటించిన చిత్రం 'నమో వేంకటేశాయ'. ఈ సినిమాలో అనుష్క కీలకపాత్ర పోషించగా, ప్రగ్యాజైశ్వాల్ హీరోయిన్‌గా నటించింది. రాఘవేంద్రుని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.