మెగాస్టార్‌తో కొరటాల పక్కా కమర్షియల్‌.!

By iQlikMovies - September 27, 2018 - 11:06 AM IST

మరిన్ని వార్తలు

మెగాస్టార్ చిరంజీవి సినిమా న్యూస్:-

 

సాధారణ కథలకు సామాజిక ఇతివృత్తాన్ని జోడించి కమర్షియల్‌గా హిట్స్‌ కొట్టడంలో దిట్ట కొరటాల శివ. చేసినవి తక్కువ సినిమాలే అయినా కానీ స్టార్‌ హీరోలతో రూపొందించి సంచలన విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్‌ కోసం ఓ సూపర్బ్‌ కథని సిద్ధం చేశాడు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. కానీ కొత్త సామాజిక అంశాన్ని టచ్‌ చేయనున్నాడట ఈ సినిమాతో.

మహేష్‌బాబుతో 'ఊరు దత్తత' అనే అంశాన్ని ఎంచుకుని 'శ్రీమంతుడు' అనే టైటిల్‌తో ఘన విజయం సాధించాడు. తర్వాత 'భరత్‌ అనే నేను' చిత్రంతో ఏకంగా మహేష్‌ని ముఖ్యమంత్రిగా చూపించి, అసెంబ్లీలో డైలాగులు ఇరగదీయించేశాడు. ఇప్పుడు మెగాస్టార్‌ కోసం సిద్ధం చేసిన కథకు తుది మెరుగులు అద్దే పనిలో ఉన్నాడట కొరటాల శివ. ప్రస్తుతం చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా పూర్తి కాకుండానే కొరటాల శివ సినిమాని పట్టాలెక్కించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి పక్కన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. తమన్నా ప్రస్తుతం 'సైరా'లో కూడా నటిస్తోంది. అయితే 'సైరా'లో తమన్నా హీరోయిన్‌ కాదు. జస్ట్‌ ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ పోషిస్తోందంతే. కానీ కొరటాల శివ సినిమాలో మెగాస్టార్‌ పక్కన మిల్కీ బ్యూటీ పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటించనుందనీ ప్రచారం జరుగుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS