'మా'లో గొడవలు రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. నరేష్, రాజశేఖర్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. మా సర్వ సభ్య సమావేశం రచ్చ రచ్చగా మారిన సంగతి తెలిసిందే. పరుచూరి గోపాలకృష్ణ లాంటి వాళ్లు అలిగి సమావేశం మధ్యలోంచే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. నరేష్‌ని `మా` పీఠం నుంచి దించేయాలన్న ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయన్న వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్క బెట్టడానికి ఇండ్రస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారని సమాచారం.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారని టాక్. `మా`లో ఇంత రచ్చ జరగడానికి కారణమైన నరేష్, రాజశేఖర్‌లను ఇంటికి పిలిపించి మాట్లాడారని తెలుస్తోంది. వారిద్దరినీ చిరు క్లాస్ పీకారని ఇండ్రస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు, కృష్ణంరాజు, నాగార్జున కూడా ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారని, `మా`లో ఇక మీదట ఎలాంటి గొడవలూ జరక్కూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారని, ఏమైనా సమస్యలు ఉంటే, లోపాయకారిగా పరిష్కరించుకోవాలని సూచించార్ట. మరి ఈ వార్నింగులు, సూచనలు ఎంత వరకూ పనిచేస్తాయో చూడాలి.