చిరంజీవి హీరోగా 151వ సినిమా 'సైరా నరసింహారెడ్డి'కి రంగం సిద్ధమైపోయింది. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్‌లో కనిపించబోతున్నారు చిరంజీవి. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం మెగాస్టార్ చిరంజీవి వర్కవుట్లు మొదలెట్టేశారు. సన్నబడేందుకు తగిన వ్యాయామాలు, ఆసనాలు వేస్తున్నారు చిరంజీవి. రీ ఎంట్రీలో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' సినిమా ఈ సినిమాకి టీజర్లా యూజ్ అయ్యిందని చెప్పొచ్చు. ఎందుకంటే మెగాస్టార్‌కి ఈ సినిమా చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో నటించాలన్నది ఆయన డ్రీమ్. ఆ డ్రీమ్ ఇన్నాళ్ల తర్వాత నెరవేరబోతోంది. ఈ సినిమా కథ, కథనాలు చాలా ఆశక్తికరంగా ఉండబోతున్నాయి. 'ఖైదీ' సినిమాలో తనను తాను లాంగ్ గ్యాప్ తర్వాత స్క్రీన్‌పై చూసుకున్నారు చిరంజీవి. సో తనలోని మార్పులు చేర్పులు, ప్లస్‌లు, మైనస్‌లు ఏమైనా ఉంటే ఈ సినిమాకి సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉన్నారు మెగాస్టార్. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సల్ సినిమాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోంది. టాలీవుడ్ నుండే కాక, బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ నుండీ ఈ సినిమాకి కాస్టింగ్‌ని సెలక్ట్ చేసుకున్నారు. బిగ్‌బీ అమితాబ్, విజయ్ సేతుపతి, నయనతార, జగపతిబాబు, సుదీప్ తదితర భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో రూపొందుతోన్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'.