చేనేత సమస్య అనేది చాలా ముఖ్యమైన విషయం. అత్యంత కీలకమైన విషయం కూడా. ఈ సమస్య ఎంత తీవ్రమైనదో నేత కార్మికుల జీవితాల్లోకి తొంగి చూస్తేనే అర్ధమవుతుంది. ఓ హీరోయిన్‌గా సమంతకు ఆ సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆమె ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తోంది ఈ విషయంలో. తెలంగాణా చేనేతకు ముద్దుగుమ్మ సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక చేనేత కార్మిక సంఘాలను సమంత పరిశీలించింది. ఈ సమస్యను సమంత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఎంతో ఆశక్తిగా చేనేత పరిశ్రమలను పరిశీలించి, అందులోని లోపాలను, వాటిని తీర్చే ఆవశ్యకతను తెలుసుకుంది. వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తానని చేనేత కార్మికులకు భరోసా ఇచ్చింది ముద్దుగుమ్మ సమంత. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏదో నాలుగైదు ఫంక్షన్స్‌లో ఆ వస్త్రాలు ధరించి తళుక్కున మెరిస్తే సరిపోతుంది. మరీ ఇంతగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓ హీరోయిన్‌గా బిజీ షెడ్యూల్స్‌లో ఉండి కూడా సమంత తన బాధ్యతను ఇంత బాగా నిర్వర్థిస్తున్నందుకు ఆమెను అభినందించకుండా ఉండలేము. హీరోయిన్‌గా తనకున్న పాపులారిటీని ఉపయోగించి సమంత ఎంత అవకాశం ఉంటే అంత ఈ సమస్యని ఎలివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. తనకు అవకాశమున్నంత వరకూ చేనేత కార్మికులకు చేయూతగా ఉండడానికి ఎంత టైం అయినా కేటాయిస్తానంటోంది ముద్దుగుమ్మ సమంత.