మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ప్రాణం ఖరీదు' సినిమా విడుదలై 40 ఏళ్లు గడిచింది. ఆ సినిమాలో ఆయన పేరు నర్సయ్య. 40 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన నటిస్తున్న 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో నరసింహారెడ్డి పాత్ర పోషిస్తున్నారు.
హీరోగా 100వ చిత్రం 'త్రినేత్రుడు'. మెగాస్టార్‌గా 149 చిత్రాల సినీ కెరీర్ సాగించిన ఆయన సినిమాలకు జస్ట్ చిన్న బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లో అడుగు పెట్టారు. తొమ్మిదేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత 'ఖైదీ'తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తొమ్మిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుని బాక్సాఫీస్ రారాజు అనిపించుకున్నారు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధలో నటిస్తున్నారు. 'సైరా నరసింహారెడ్డి' అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాత. ప్రస్తుతం జార్జియాలో సైరా టీమ్ సందడి చేస్తోంది. అక్కడ 25 రోజుల పాటు జరిగే లాంగ్ షెడ్యూల్‌లో భాగంగా పలు ఇంపార్టెంట్ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించనున్నారు. వందలాది విదేశీ నటులతో టెక్నీషియన్స్‌తో ఇక్కడ జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ కానున్నాయట. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ చిరంజీవికి గురువుగా కీలక పాత్రలో నటిస్తున్నారు.
కన్నడ నటుడు సుదీప్, జగపతిబాబు తదితర ప్రముఖ నటులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన సుదీప్ ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.