సినిమా టికెట్ల రేట్లకు సంబధించిన జీవోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పున: పరిశీలిస్తామనట్లుగా వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. ఇది సినిమా పరిశ్రమకి శుభవార్త అని చెప్పారు. సిఎం జగన్ తో భేటి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రితో భేటి చాలా సానుకూలంగా జరిగిందని, పరిశ్రమ కష్టాలపై ఆయన ఆలోచిస్తున్నారని, వారం రోజుల్లోనే ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం నుంచి ఒక పరిష్కార మార్గం వచ్చే అవకాశం వుందని వెల్లడించారు చిరు.
పరిశ్రమ నుంచి దయచేసి ఎవరూ కూడా సహనం కోల్పోయిమాట్లాడకూడని, ఇది పెద్దగా కాదు పరిశ్రమ బిడ్డగా తన మనవి అని చెప్పుకొచ్చారు చిరు. ఐదు ఆటలకు సంధించిన వినతిపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, తర్వలోనే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని నమ్మకంగా చెప్పారు మెగాస్టార్. అన్ని సమస్యలు ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకెళ్లానని, త్వరలోనే అన్ని సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుందనే ఆశభావం తనలో వుందని చెప్పారు చిరు.