కొర‌టాల సినిమాలో చ‌ర‌ణ్‌?

మరిన్ని వార్తలు

లూసీఫ‌ర్ సినిమాని రీమేక్ చేయాల‌ని మెగా కాంపౌండ్ స‌న్నాహాలు చేస్తోంది. మ‌ల‌యాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన సినిమా ఇది. చిరంజీవి కోసం రీమేక్ రైట్స్‌ని తీసుకున్నారు. ఈ సినిమాలో ఫృథ్వీరాజ్ ఓ కీల‌క పాత్ర పోషించారు. ఆ పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టించే అవ‌కాశాలున్నాయి. `నేనూ చ‌రణ్ క‌లిసి ఆ సినిమా చేయ‌బోతున్నాం` అని చిరు కూడా ఓసంద‌ర్భంలో ప్ర‌క‌టించారు. అయితే అంత‌కంటే ముందే చిరు - చ‌ర‌ణ్‌లు క‌లిసి ఓసినిమాలో న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌.

 

ప్ర‌స్తుతం చిరంజీవి - కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో చ‌ర‌ణ్ కూడా న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. ఓ కీల‌క‌మైన పాత్ర‌లో చ‌ర‌ణ్ క‌నిపిస్తాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంటే లూసీఫ‌ర్ కంటే ముందే.. చిరు -చ‌ర‌ణ్ క‌లిసి క‌నిపించ‌బోతున్నార‌న్న‌మాట‌. `ఖైది నెం 150`లోని ఓ పాట‌లో చ‌ర‌ణ్‌, చిరు క‌ల‌సి చిందులేసిన సంగ‌తి తెలిసిందే.  


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS