బాబోయ్‌ ఈ మంచోడికి ఇన్ని పేర్లా.?

మరిన్ని వార్తలు

'మా మనవడు శివ మంచోళ్లకే మంచోడు.. నా కొడుకు ఆచార్య చాలా మంచోడు.. ఆ అల్లుడు బాలు ఎంతో మంచోడో. నా హీరో బాలు చాలా మంచివాడు. మా అన్నయ్య రిషి ఎంతో మంచోడో..' అంటూ ఎవరికి తోచిన పేరు వారు పెట్టుకుని, వరుస కలిపేస్తూ, 'మంచోడు' అనే పాయింట్‌ని కామన్‌గా రైజ్‌ చేస్తున్నారు. ఇంతకీ ఈ మంచోడి గోలేంట్రా అనుకుంటున్నారా.? నందమూరి హీరో కళ్యాణ్‌రామ్‌ నటిస్తున్న కొత్త చిత్రం పేరు 'ఎంత మంచి వాడవురా!' టైటిల్‌ తెలసిందే కదా. లేటెస్ట్‌గా టీజర్‌ వదిలారు. ఆ టీజర్‌లోనే ఈ మంచోడి జపం చేస్తున్నారు వీరంతా.

 

అయితే మనోడి మంచితనం ఏంటీ? అంటే, నలుగురు రౌడీల్ని పిచ్చ పిచ్చగా ఉతికి ఆరేస్తున్నాడు. అందరూ మంచోడంటున్నారు. నువ్వేంట్రా మీర ఇలా కొడుతున్నావ్‌.. అని ఆ రౌడీల్లో ఒకడు అడగ్గా, 'రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసురుడ్ని ఏసేయలా..' అని కళ్యాణ్‌ రామ్‌ ఇచ్చిన పంచ్‌ డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. టీజర్‌ని చాలా హాయిగా, ఆహ్లాదంగా డిజైన్‌ చేశారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, వినసొంపైన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌తో కట్‌ చేశారు.

 

టీజర్‌ చివరలో మళ్లీ ఎప్పుడొస్తావురా? అని తండ్రి పాత్రలో ఉన్న తనికెళ్ల భరణి, కళ్యాణ్‌రామ్‌ని అడగ్గా, సంక్రాంతికి వస్తా నాన్నా.. అని కళ్యాణ్‌రామ్‌ ఇచ్చిన సమాధానం, సినిమా రిలీజ్‌ టైమ్‌ని తెలియజేస్తోంది. అంటే అర్ధమైందిగా, సంక్రాంతికి మన మంచోడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడన్న మాట. సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS