మెగాస్టార్‌నే సమ్మోహితుడ్ని చేశాడు

By iQlikMovies - May 02, 2018 - 18:39 PM IST

మరిన్ని వార్తలు

సుధీర్‌ బాబు హీరోగా అదితీరావ్‌ హైదరీ హీరోయిన్‌గా 'సమ్మోహనం' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్‌ని తాజాగా మెగాస్టార్‌ విడుదల చేశారు. టీజర్‌ చాలా ఎట్రాక్టివ్‌గా ఉంది. అందుకే మెగాస్టార్‌ కూడా సమ్మోహితుడయ్యారు ఈ టీజర్‌ చూసి, ఓ అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయికి, ఓ ఫిలిం స్టార్‌కీ మధ్య జరిగే లవ్‌స్టోరీని ఈ సినిమాలో చూపించబోతున్నారు. 

'అష్టా చెమ్మా' తదితర చిత్రాలతో దర్శకుడిగా తన డిఫరెంట్‌ స్టైల్‌ని చూపించిన ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 'ప్రేమ కథా చిత్రమ్‌' సినిమాతో మంచి హిట్‌ అందుకున్న సుధీర్‌ బాబు తర్వాత పలు చిత్రాల్లో నటించాడు. కానీ ఆ స్థాయిలో విజయం సుధీర్‌ని వరించలేదు. కానీ ఈ చిత్రం ఆ లోటు తీర్చేలా ఉందంటున్నారు. అందులోనూ మెగాస్టార్‌ చెయ్యి పడింది ఈ చిత్రానికి. దాంతో సక్సెస్‌ సింప్టమ్స్‌ బాగా కనిపిస్తున్నాయి. 

టీజర్‌లో సుధీర్‌ బాబు చెప్పే డైలాగులు, అదితీరావ్‌ పలుకుతున్న తెలుగు పలుకులు చాలా అందంగా, ఆహ్లాదంగా అనిపించడంతో పాటు, నేచురాలిటీకి దగ్గరగా అనిపిస్తున్నాయి. టైటిల్‌కి తగ్గట్లుగానే టీజర్‌ హార్ట్‌కి బాగా కనెక్ట్‌ అయ్యింది. డిఫరెంట్‌ అండ్‌, స్ట్రాంగ్‌ లవ్‌స్టోరీలా ఈ సినిమా కథ ఉండబోతోందని టీజర్‌ చూస్తే అర్ధమవుతోంది. 

కార్తీతో 'చెలియా' సినిమాలో నటించిన ముద్దుగుమ్మ అదితీరావ్‌ హైదరీ ఈ సినిమాతో స్ట్రెయిట్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. మరో వైపు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ - సంకల్ప్‌ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS