జిల్‌ జిల్‌ జిగేల్‌ పూజా హెగ్దే!

By iQlikMovies - March 19, 2018 - 10:44 AM IST

మరిన్ని వార్తలు

జిగేల్‌ రాణి.. జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి.. ఈ జిగేల్‌ రాణి తొలిసారిగా ఐటమ్‌ సాంగ్‌ చేసేసింది 'రంగస్థలం' సినిమా కోసం. 

'ఒక లైలా కోసం', 'ముకుంద' సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి 'డిజె - దువ్వాడ జగన్నాథమ్‌' సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ వచ్చేసింది. వరుస ఆఫర్లతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి, సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అలా సోషల్‌ మీడియాలో హీటెక్కించే ఫొటోలతో ఈ బ్యూటీ, ఫాలోవర్స్‌నీ పెంచుకుంటోంది. 

ఇప్పటిదాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు, 'జిల్‌ జిల్‌ జిగేల్‌ రాణి'గా 'రంగస్థలం' సినిమాలో చేసిన ఐటమ్‌ సాంగ్‌ ఇంకో ఎత్తు అని టాలీవుడ్‌ ఈమె గురించి చర్చించుకుంటోంది. ఆ సంగతి పక్కన పెడితే 'సాక్ష్యం' సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన నటించి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ బ్యూటీ. ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఎక్స్‌పోజింగ్‌ చేసినా, చెయ్యకున్నా పూజా హెగ్దే సెక్సప్పీల్‌ జిల్‌ జిల్‌ జిగేల్‌ అంతే! చూపించీ చూపించనట్టుగా ఆ 'తెరచాటు' అందాల్ని చూపించేస్తోన్న ఈ అందాల పూజాకి ఫిదా అవనివారెవరుంటారు?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS