సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ - మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగానే కనిపిస్తారట. కాకపోతే పది నిముషాల ప్లాష్ బ్యాక్ లో మాత్రమే అలా కనిపిస్తారట. ఇక ఈ సినిమా స్క్రిప్టు ఫైనల్ వెర్షన్ జరుగుతోంది.
ఈ సినిమాకి టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేస్తున్నారట. మొత్తంగా చెప్పాలంటే ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా ఈ సినిమా రానుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలు కానుందని.. రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు సినిమాలోని కొన్ని కీలక సన్నివేవాలను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిషను హీరోయిన్ గా తీసుకోనున్నారని సమాచారం.
కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. అన్నట్లు ప్రభాస్ - కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందని తెలుస్తోంది. రచయితగా ఉన్న కొరటాలకు మొదటిసారి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రభాస్ కి, మరి కొరటాల ఏ రేంజ్ హిట్ ఇస్తాడో చూడాలి. అయితే ప్రభాస్ - కొరటాల సినిమా 2021లో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది