చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ అంటే బేసిగ్గా ఆఫీస్, ప్రసాద్ లాబ్ లేదా ఏదైనా హోటల్ లో యూనిట్ వచ్చి సినిమా గురించి మాట్లాడి వెళ్ళిపోతుంది. కానీ వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ మాత్రం కాస్త వెరైటీగా జరిగింది. వాల్తేరు వీరయ్య కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన భారీ సెట్ లో ఒక ఈవెంట్ లా ఈ ప్రెస్ మీట్ పెట్టారు. శ్రుతి హాసన్ తప్పితే మిగతా టీమ్ అంతా జూనియర్ ఆర్టిస్ట్ లతో సహా ఈ ప్రెస్ మీట్ లో హాజరయ్యింది. ఈ వేడుక లాంటి ప్రెస్ మీట్ ని చూసిన చిరంజీవి .. ఇంక ప్రీరిలీజ్ ఈవెంట్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
స్పీచులు కూడా భారీగానే సాగాయి. మొదటి ప్రెస్ మీట్ లోనే యూనిట్ అంతా వీరయ్య పై వేరే లెవల్ అంచనాలు పెంచింది. చిరంజీవి కూడా భారీ స్పీచ్ ఇచ్చారు. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పుకుంటూ వెళ్లారు. ప్రెస్ మీట్ లో చాలా భాగం స్పీచులకే వెళ్ళిపోయింది. క్యూ అండ్ ఏ సెషన్ కూడా అనుకున్నారు. మీడియా నాలుగు ప్రశ్నలు అడిగిసరికే.. ఇక చాలు సమయం దాటింది మరో రోజు మాట్లాడుకుందామని ప్రశ్నల సెక్షన్ ని త్వరగానే ముగించేశారు.