హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం పడి పడి లేచెను మనసు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.
ఇక విషయానికి వస్తే, ప్రముఖ దర్శకుడు-డిస్ట్రిబ్యూటర్ అయిన సురేష్ బాబు ఈ సినిమా కథ విని, ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసి ఫిదా అయిపోయాడట. ఈ చిత్రం ఆయనకి ఎంత నచ్చిందంటే, వెంటనే ఈ సినిమా పంపిణీ హక్కులని రెండు తెలుగు రాష్ట్రాలకి కలిపి కోనేశాడట.
ఈ హక్కులకి సుమారు రూ 18 కోట్ల మేర చెల్లించినట్టుగా సమాచారం. ఈయనతో పాటు మరొక ప్రముఖ పంపిణీ సంస్థ కూడా ఈ డీల్ లో భాగంగా ఉండండి సమాచారం. ఏదేమైనా.. ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే ఇంత మంచి ఆఫర్ రావడం ఈ సినిమా యూనిట్ ని ఆనందంలో ముంచ్చేత్తింది.
ఏదేమైనా.. ఈ డీల్ శర్వానంద్ సినిమా పైన అంచనాలని ఒక్కసారిగా పెంచేసింది.